Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహారాష్ట్రలో కాల్పుల కలకలం... టోల్ గేట్లపై ఉద్యమిస్తున్న సీపీఐ నేతకు తీవ్రగాయాలు

మహారాష్ట్రలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. సీపీఐ నేత గోవిందరావు పన్నారేపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు. కొల్హాపుర్ లో జరిగిన ఈ ఘటనలో పన్సారేకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన పన్సారేను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టోల్ గేట్ల అక్రమాలపై పన్సారే పలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో పన్సారేపై కాల్పులకు పాల్పడిన వ్యక్తులు టోల్ గేట్ల యాజమాన్యాలకు చెందిన వారే అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News